ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (12:14 IST)

'గ్యాంగ్ లీడర్' నటుడు వల్లభనేని జనార్థన్ కన్నుమూత

janardhan
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగు నెలల్లో నలుగురు సీనియర్ నటులు కన్నుమూశారు. తొలుత రెబల్ స్టార కృష్ణం రాజు, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, మహా నటుడు కైకాల సత్యనారాయణ, నటుడు చలపతి రావులు చనిపోయారు. గురువారం ప్రముఖ నటుడు, నిర్మాత వల్లభనేని జనార్థన్ తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రి చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, గురువారం ఉదయం 10.20 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
ఈయన ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. పెద్దమ్మాయి శ్వేత చిన్న వయస్సులోనే చనిపోయిగా, రెండో కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనరుగా, కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రాణిస్తున్నారు. నటుుడు జనార్థన్ మృతితో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం అలముకుంది. జనార్థన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాన్ని తెలుపుతున్నారు. చిరంజీవి నటించిన "గ్యాంగ్ లీడర్" చిత్రంలో వల్లభనేని జనార్ధన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి పేరుతో పాటు గుర్తింపు పొందారు.