గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2024 (15:13 IST)

టాలీవుడ్ డైరెక్టర్ జానకిరామ్ ఆత్మహత్య, అతడి తమ్ముడు మిస్సింగ్

GST Director Janakiram
టాలీవుడ్ డైరెక్టర్ జానకిరామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా అతడు సోమవారం నాడు హైదరాబాదులో ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ దర్శకుడు GST అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం 2021లో విడుదలైంది. ఐతే అనుకున్నంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. అప్పట్నుంచి జానకిరామ్ క్రమంగా ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యాడు.
 
దీనితో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలో నివాసం వుంటున్న అతడి తమ్ముడు బాలకృష్ణ ఈ వార్త తెలుసుకుని బైకు పైన ఎక్కడికో వెళ్లిపోయాడు. అతడి ఆచూకి ఇప్పటివరకూ తెలియరాలేదు. అన్నయ్య మరణవార్తను తట్టుకోలేని బాలకృష్ణ తీవ్ర ఉద్వేగానికి లోనై వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అతడి ఫోన్ కూడా స్విచాఫ్ చేసి వుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.