ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (13:12 IST)

అరుదైన వ్యాధికి గురైన మళయాళ నటుడు.... షాకింగ్ న్యూస్ వెల్లడి

shine tom chacko
'దసరా' ఫేమ్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తున్నారు. నాని నటించిన 'దసరా'లో విలన్ పాత్రలో మెప్పించిన తర్వాత నాగ శౌర్య 'రంగబలి'లోనూ విలన్‌గా నటించారు. ప్రస్తుతం "దేవర"లోనూ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. అయితే, ఈయన గత కొన్ని రోజులుగా ప్రేమ, రిలేషన్‌షిప్‌ విషయాలతో మళయాళ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నాడు షైన్‌ టామ్ చాకో. 
 
ఈ యేడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో  ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తమ ఎంగేజ్‌ మెంట్‌ ఫొటోల్ని కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్‌ను ఆయన వెల్లడించారు. తనూజాతో తన సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని వెల్లడించాడు. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తనూజాతో కలిసున్న ఫొటోలను తొలగించారు.
shine tom chacko
 
ఇక తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్డి)తో బాధపడుతున్నట్లు ఇది ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు అని తెలిపారు. ఎడిహెచ్‌డి ఉన్న ఎవరైనా.. తమను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గుర్తించాలని కోరుకుంటారని.. ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని తెలిపారు. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టి తమపై ఉండేలా కోరుతూ.. పాత్రకు అనుగుణంగా ప్రదర్శన చేస్తారని తెలిపారు. బయటి వ్యక్తులు దీనిని ఒక రుగ్మతగా భావిస్తారని.. తనకు మాత్రం ఎడిహెచ్‌డి ఒక క్వాలిటీ లాంటిదని షైన్ టామ్ చాకో తెలిపారు.