శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జులై 2024 (12:34 IST)

"టాక్సిక్"లో యష్‌తో శ్రుతిహాసన్.. రొమాన్స్ చేస్తుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల పలు హైప్రొఫైల్ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ "కూలీ"లో నటించనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన "కూలీ" చిత్రంలో ఆమె రజనీకాంత్ కూతురిగా నటిస్తుంది. 
 
ఈమె ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న "సాలార్ 2"లో కూడా మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే యష్ రాబోయే చిత్రం "కేజీఎఫ్"లో ఒక ప్రముఖ పాత్రను పోషించడానికి ఆమెను సంప్రదించారు. 
 
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న "టాక్సిక్" ఇందులో యష్ డాన్‌గా నటించారు. ఇందులో యష్ సోదరిగా నయనతార, యష్ ప్రియురాలిగా కైరా అద్వానీ నటిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది.