శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (17:38 IST)

యష్ "టాక్సిక్‌"లో హుమా ఖురేషి..

'కేజీఎఫ్' సినిమాతో ఇండియా మొత్తం పాపులర్ అయిన యష్ ఆ తర్వాత 'ది టాక్సిక్' సినిమాలో నటిస్తున్నాడు. దీనికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇందులో నయనతార సోదరి పాత్రలో నటిస్తుండగా, హిందీ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 
 
1950, 1970ల నాటి డ్రగ్స్ మాఫియాను ఇంగ్లండ్‌లో చిత్రీకరించనున్నారు. తాజాగా, నటి తారా సుతారియా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా చేరింది. ఈ చిత్రంలో యష్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు.