శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ మృతి

nsrprasad
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్‌ఎస్ఆర్ ప్రసాద్ చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... శనివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గతంలో ఆర్యన్ హీరోగా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నిర్మంచిన నిరీక్షణ చిత్రంతో ప్రసాద్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా శత్రువు, నవదీప్ హీరోగా నటుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు. 
 
ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం రెక్కీ విడుదల కావాల్సివుంది. ఈయన స్వస్థలం వెస్ట్ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం. చిన్న వయుసులోనే కేన్సర్ వ్యాధిబారినపడి ఆయన ప్రాణాలు కోల్పోవడంతో చిత్రపరిశ్రమలో విషాదం నింపింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుతున్నారు.