మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:06 IST)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈ రోజు చార్మీ వంతు

తెలుగు చిత్రపరిశ్రమలో అలజడి రేకెత్తించిన డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో తొలుత టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఇపుడు చార్మీ వంతు వచ్చింది. 
 
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి.. ఈడీ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కోణంలో ఛార్మి బ్యాంక్ అకౌంట్స్‌ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. 
 
కెల్విన్ అకౌంట్‌లోకి ఛార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై అరా తీయనుంది. కెల్విన్‌కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఎంతకాలంగా కెల్విన్‌తో చార్మికి పరిచయం ఉంది? డ్రగ్స్ సేవించారా? కెల్విన్‌తో పాటు సరఫరాకు కూడా సహకరించారా? అసలు ఎన్ని సార్లు కెల్విన్ అకౌంట్‌కు ఛార్మి మనీ ట్రాన్‌ఫర్ చేసిందన్న కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ చేయనుంది.