ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 మే 2021 (21:37 IST)

త్రిష ఇదే చివ‌రి బేచలర్ బ‌ర్త్‌డే అంటోన్న‌ చార్మి

Trisha, samantha
త్రిష పెళ్ళి చేసుకోబోతున్న‌ద‌న్న విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. కాగా, ఈ రోజు త్రిష పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు స‌మంత అక్కినేని శుభాకాంక్ష‌లు తెలుపుతూ, త్రిష హావ‌భావాలులాగా తాను చూస్తున్న ఫోజ్‌తో విషెస్ తెలిపింది. ఇక రామ్‌చ‌ర‌ణ్ అయితే త‌న పేజ్‌లో త్రిష గ‌త కాలంఫొటో పెట్టి బ్యూటిఫుల్ న‌టికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్‌చేశాడు. ఇదిలా వుండ‌గా, మ‌రికొంద‌రు త్రిష‌కు పుట్టిన‌రోజుతోపాటు పెండ్లికి కూడా ప‌నిలో ప‌నిగా చెప్పేశారు. దీంతో త్రిష పెండ్లి ఖ‌రారు అని తేలిపోయింది.
 
with ramcharan
త్రిష కృష్ణన్ త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ సినీ ప్రియుల‌కు ప‌రిచిత‌మే. తెలుగులో వ‌ర్షం సినిమా ప్ర‌భాస్‌తో న‌టించింది. అది ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. త్రిష పుట్టిన‌రోజు నాడే పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ ఛార్మి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. "హ్యాపీయెస్ట్ బర్త్ డే త్రిష. నాకు ఇదే నీ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అని బలంగా అన్పిస్తోంది" అంటూ ట్వీట్ చేసింది ఛార్మి. ఇంకేముంది ఛార్మి ఇన్‌డైరెక్టుగా త్రిష పెళ్ళిని కన్ఫర్మ్ చేసేసింది. ఛార్మి చేసిన ట్వీట్ త్రిష పెళ్లిపై వస్తున్న పుకార్లకు బలం చేకూరేలా చేసింది. మరి త్వరలో పెళ్లి విషయాన్ని త్రిష త్వరలో ప్రకటిస్తుందేమో చూడాలి.