బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (09:35 IST)

తెలుగులో హాస్యపాత్రల స్థాయి దిగజారింది : నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్

తెలుగు చిత్రపరిశ్రమలో ఇపుడు హాస్య పాత్రల స్థాయి మరింత దిగజారిపోయిందని నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ వ్యాఖ్యానించారు. అప్పట్లో హాస్యపాత్రలకు కథలో తగిన ప్రాధాన్యత, గౌరవం ఉండేవన్నారు. ప్రస్తుతం కథతో సంబంధం

తెలుగు చిత్రపరిశ్రమలో ఇపుడు హాస్య పాత్రల స్థాయి మరింత దిగజారిపోయిందని నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ వ్యాఖ్యానించారు. అప్పట్లో హాస్యపాత్రలకు కథలో తగిన ప్రాధాన్యత, గౌరవం ఉండేవన్నారు. ప్రస్తుతం కథతో సంబంధంలేని పాత్రలు ఎక్కువ కావడం వల్ల స్థాయి దిగజారిపోతోందని ఆయన విచారం వ్యక్తంచేశారు.
 
వ్యక్తిగత పర్యటన నిమిత్తం విజయవాడ వచ్చిన ఆయన మాట్లాడుతూ... ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తాను ఊహించకుండా నటుడినై, ఇప్పటికి 970 చలనచిత్రాల్లో నటించానని గుర్తు చేశారు. 'అంకుశం', 'మామగారు', 'మాయలోడు' తనకు మైలురాళ్లన్నారు కోట శ్రీనివాపరావుతో జంటగా నటించిన అన్ని సినిమాల్లోనూ పోటీపడి నటించేవారమని గుర్తు చేశారు. 
 
అదేసమయంలో తెలుగులో సమర్థత ఉన్న హాస్యనటులకు కొదువలేదన్నారు. కానీ, ప్రస్తుతం తెలుగు చలన చిత్రాల్లో హాస్యపాత్రల స్థాయి దిగజారిందన్నారు. దీనికి కారణం నటీనటుల సంఖ్య పెరగడంతో పాటు.. కథకు సంబంధం లేని పాత్రలు ఎక్కువ కావడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలోని ఆంథోల్‌ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్నానని, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కిందన్నారు.