ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (14:11 IST)

టక్ జగదీష్ రిలీజ్‌పై క్లారిటీ : చవితికి ఓటీటీలో సందడి

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన చిత్రం టక్ జగదీష్. రీతూ వర్మ హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 'నిన్ను కోరి' తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండో చిత్రం. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రం విడుదలపై ఓ క్లారిటీ లేకుండా ఉండగా, దానికి మేకర్స్ శుక్రవారం ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా విడుదల విషయంపై చర్చ జరుగుతూనే ఉంది.
 
నిజానికి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కోసం ఏప్రిల్ నుండి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా మిగతా సినిమాల్లాగే ఈ సినిమా కూడా విడుదలను వాయిదా వేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా ఒకసారి ఓటిటిలో విడుదలవుతుంది అంటే కాదు థియేటర్లలోనే విడుదల అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటిలోనే ఉంటుందని కన్ఫర్మ్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఫైర్ అయ్యారు.