బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:17 IST)

#TuckJagadishteaser నుంచి మోషన్ పోస్టర్.. కర్ర పట్టుకున ఫైట్‌కు నాని

Tuck jagadish
'నిన్నుకోరి' సినిమా తరవాత డైరెక్టర్ శివ నిర్వాణతో నేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమా 'టక్ జగదీష్'. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
తాజాగా 'టక్ జగదీష్' సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజైంది. 35 సెకండ్ల పాటు సాగే ఈ టీజర్‌లో కర్ర పట్టుకుని ఫైటింగ్‌కు వెళ్తున్నట్లు నాని కనిపిస్తున్నాడు. హీరో నాని లుక్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో నానికి జోడిగా 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 23 సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.