శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (13:53 IST)

#ChokingAt30000Ft : సాక్సులు కప్పలు చచ్చిపోయినంత కంపు... : ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్ హీరో, అలనాటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఇటీవల తన సోదరితో కలిసి ఆస్ట్రియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ బాగానే ఎంజాయ్ చేశారు. ఈ హాలిడే ట్రిప్‌ను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆమెకు విమానంలో ఓ విచి

బాలీవుడ్ హీరో, అలనాటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఇటీవల తన సోదరితో కలిసి ఆస్ట్రియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ బాగానే ఎంజాయ్ చేశారు. ఈ హాలిడే ట్రిప్‌ను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆమెకు విమానంలో ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసుకుందాం... 
 
భారత్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఓ ప్రయాణికుడు ధరించిన సాక్సుల నుంచి వస్తున్న దుర్వాసనతో తల్లడిల్లిపోయిందట. అతడి సాక్సులు కంపు కొడుతుండటంతో వారి ముక్కుపుటాలు అదిరిపోయాయట. ఊపిరాడక అల్లాడిపోయారట. 
 
#ChokingAt30000Ft అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. 'సాక్సులు కప్పలు చచ్చిపోయినంత కంపు కొడుతున్నాయని తోటి ప్రయాణికుడి ఎలా చెప్పేది..? దేశాలను రసాయన ఆయుధాలతో నాశనం చేసేయొచ్చన్న విషయాన్ని అతడికి ఎలా అర్థమయ్యేలా చేసేది?' అంటూ ట్వీట్ చేశారు. 
 
దీనికి పలువురు నెటిజన్లు ట్వీట్లు ఇస్తూ సానుభూతిని వ్యక్తం చేయగా, మరికొందరు లేదంటే ఎయిర్ హోస్టెస్‌‌కు చెప్పి సెంట్ కొట్టొచ్చు కదా అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీనికి ట్వింకిల్ రిప్లై ఇస్తూ... 'ఆ ప్రయత్నాలూ చేశాం. ఎయిర్ హోస్టెస్ వచ్చి వాసన పసిగట్టి.. జాలిగా మొహం పెట్టేసి వెళ్లిపోయింది. ఇక మేం చేసేదేముంది. అతడు ఆదమరచి నిద్రపోయాక ఆమె అతడి పాదాలపై సెంట్ కొట్టింది. అయినా...' అంటూ ట్వీట్ చేశారు.