గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (18:21 IST)

"ఆర్ఆర్ఆర్" చిత్రానికి మరో రెండు విదేశీ అవార్డులు

rrrmovie
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్" చిత్రం అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులను గెలుచుకుంటున్నాయి. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఇపుడు మరో రెండు విదేశీ అవార్డులను కైవసం చేసుకుంది.
 
హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్ సొసైటీని కూడా ఆకట్టుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి మార్చి 12వ తేదీన జరుగనున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమంపైనే కేంద్రీకృతమైంది. నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్ముతున్నారు.