ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (04:29 IST)

నేనెప్పుడో తెలుగింటి అమ్మాయిని అయిపోయా... అదాశర్మ ఉగాది సంతోషం

గత ఏడాది ఉగాదికి నెల రోజుల ముందే క్షణం వంటి సూపర్ హిట్ సినిమాను సొంతం చేసుకున్న యువ హీరోయిన్ అదాశర్మ ఆ ఏడాది ఉగాదికి ముదుగా విడుదలైన హిందీ సినిమా కమాండో-2తో మరో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగాదికి ముందు వచ్చిన రెండు సినిమాలూ హిట్ కావడంతో అదాశర్మ

గత ఏడాది ఉగాదికి నెల రోజుల ముందే క్షణం వంటి సూపర్ హిట్ సినిమాను సొంతం చేసుకున్న యువ హీరోయిన్ అదాశర్మ ఆ ఏడాది ఉగాదికి ముదుగా విడుదలైన హిందీ సినిమా కమాండో-2తో మరో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగాదికి ముందు వచ్చిన రెండు సినిమాలూ హిట్ కావడంతో అదాశర్మ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందుకే ఈ విజయాన్ని, సంతోషాన్ని తన వాళ్లతో పంచుకోవడానికి ఈసారి కూడా ఉగాదికి హైదరాబాద్ వచ్చేసింది.
 
టాలీవుడ్ తనకు తీపి గుర్తులు అందించింది కాబట్టి నేనెప్పుడో తెలుగమ్మాయిని అయిపోయా అంటూ సంతోషం వెలిబుచ్చింది అదాశర్మ. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... షడ్రుచుల సమ్మేళనం మనిషి జీవితం. దీనికి ప్రతీక తెలుగు సంవత్సరాది.. ఉగాది. గతేడాది ఉగాదికి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. పండక్కి నెల రోజుల ముందే ‘క్షణం’ వంటి సూపర్‌హిట్‌ను తెలుగు ప్రేక్షకులు నాకు బహుమతిగా ఇచ్చారు. నా సంతోషాన్ని ఇక్కడివాళ్లతో కలసి పంచుకున్నా. ఈ నెలలో విడుదలైన హిందీ సినిమా ‘కమాండో–2’ మంచి విజయం సాధించింది. అందులో నేను తెలుగమ్మాయి భావనారెడ్డిగా నటించా అని తెలిపింది. 
 
కథానాయికగా నా ప్రయాణంలో షడ్రుచులున్నాయి. కానీ, నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది, తీపి గుర్తులు అందించిందీ తెలుగు చిత్ర పరిశ్రమే. అందువల్ల, నేనెప్పుడో తెలుగింటి అమ్మాయిని అయిపోయా. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది అంటే నాకూ ఇష్టమే. ఈ పండక్కి ‘ఐఫా ఉత్సవమ్‌’లో నేను సంప్రదాయ వస్త్రాధారణలో హాజరవుతున్నా. ఈ వేడుక కోసం మా అమ్మ చీరను కట్టుకుంటున్నా అంటూ నయగారాలు పోయిందీ ముద్దుగుమ్మ.