ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:14 IST)

''రామ్''తో ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి రొమాన్స్..?

ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి వరుసగా సినీ ఛాన్స్‌లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అధికారికంగా ఆమె చేస్తున్న సినిమాల ప్రకటన రాకపోయిన ఈ అమ్మడు కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతేకాదు,'ఉప్పెన' కోసం తెలుగు నేర్చుకున్న కృతి.. తెలుగు బాగా అర్థం చేసుకుని, మాట్లాడే స్థితికి చేరుకున్నారు. దింతో కృతి తెలుగువాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యింది. 
 
తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన సినిమాలో ఉప్పెన పాపను సజెస్ట్ చేస్తున్నాడని వినిపిస్తోంది. రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
 
కాగా ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా తీసుకొనే అవకాశం కనిపిస్తుంది. కృతి ఎక్కువ సినిమాలు కమిట్ కాకముందే రామ్ సినిమాకి ఒప్పించే పనిలో పడ్డారట చిత్రబృందం. కొద్దిరోజుల్లోనే కృతిని సంప్రదించి ఓకే చేసే ప్రయత్నంలో ఉన్నారట.