మహేష్ బాబు ఏజ్ తగ్గుతుందట
Maheshbabu, minash grabiel
ఎవరికైనా ఏజ్ రోజు రోజుకూ పెరుగుతుంటుంది. కానీ కొందరికి ఎప్పటికీ ఒకేలా వుంటారు. మరికొందరు వయస్సు తగ్గినట్లుగా వుంటారు. అది వారి జీన్స్ బట్టి ఆధారపడి వుంటుందంటారు. కానీ ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియెల్ మాత్రం పట్టుదల, క్రమశిక్షణ కూడా వుండాలంటారు. అది మహేష్‌బాబుకు మెండుగా వుందంటూ కితాబిచ్చాడు. అందుకే మహేష్ బాబుకు వయస్సు తగ్గుతుందని చెబుతున్నాడు.
ఈ రోజ నేను చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మహేష్ బాబును నేను 2019లో కలిసినప్పుడు ఎలా వున్నారో అంతకంటే ఇంకా యంగ్‌లా ఇప్పుడు వున్నాడని ట్వీట్ చేశాడు. మహేష్ బాబు గత 40 రోజులుగా దుబాయ్‌లో `సర్కారివారి పాట` సినిమా షూటింగ్ కు వెళ్ళారు. అక్కడ షూటింగ్‌లో ఆయన చురుకుదనం, ఆరోగ్యం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు గురించి ట్రైనర్ తెలియజేశారు.
ప్రతిరోజూ షూటింగ్ అయిన వెంటనే సాయంత్రం మహేష్ బాబు చేసే వర్కవుట్‌లు, వ్యాయామం మామూలుగా వుండదు. దాదాపు 30 రోజులు అక్కడే వున్నాను. శిక్షణలో ఎరోబిక్ వెరైటీస్, కార్డియా స్ట్రెన్త్‌కి సంబంధించిన వ్యాయామాలు విడివిడిగా చేసేవాడు మహేష్ బాబు. ఆయన చాలా చురుగ్గా చేసేవారు. జంపింగ్ అయితే సరేసరి. కుర్రాడిలా చేసేవాడు. ఇంతవరకు ఇంతలా ఫిట్‌గా వున్న హీరోను చూసినందుకు గర్వంగా వుందని ట్వీట్ చేస్తూ వీడియో కూడా అప్‌లోడ్ చేశాడు. అందుకే మహేష్ బాబు అంటే హీరోయిన్లు ఇష్టపడేది.