గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (12:54 IST)

'సీఎం పవన్‌'తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం... హీరోయిన్ ట్వీట్

Urvashi Rautela
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "బ్రో". సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రను పోషించగా, పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు. వీరిలో ఒకరు బాలీవుడ్ నటి ఊర్వరి రౌతలా. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆమె చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని అడ్డుపెట్టుకుని ఊర్వశిని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 
 
"బ్రో" ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వేదికపై పవన్, సాయి ధరమ్ తేజ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె.. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే, ఆమె పొరపాటున పవన్‌ను ఏపీ ముఖ్యమంత్రి అని సంభోదించారు.
 
దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ సీఎం కాదన్న విషయం కూడా ఆమెకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జనసైనకులు, పవన్ అభిమానులు మాత్రం 2024లో జరగబోయే దాన్ని ఊహించుకుని ఊర్వశి ముందుగానే అంచనా వేశారంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.