సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (18:02 IST)

ఐటమ్ సాంగ్స్ చేస్తూనే రూ.190 కోట్ల బంగ్లా కొనేసింది..?

Urvashi Rautela
ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతౌలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో బంగ్లాను కొని సంచలనం సృష్టించింది. ఉత్తర దక్షిణాది సినిమాలతో కలిసి ఊర్వశి రౌతులా 15 సినిమాల్లో నటించింది. ఇందులో హీరోయిన్‌గా ఆమె నటించినవి కేవలం ఐదు మాత్రమే. 
 
అయితే ఎక్కడా డీలా పడిపోలేదు. తన అందచందాలను ఐటమ్ పాటలకు ఉపయోగించి భారీగా సంపాదిస్తోంది. ఇటీవల కేన్స్ కార్పెట్‌పై కూడా మెరిసింది. తెలుగులో "వాల్తేర్ వీరయ్య"లో "బాస్ పార్టీ" అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో "వైల్డ్ సాలా" అంటూ అదరగొట్టింది. 
 
తాజాగా బోయపాటి -రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఐటెం గాళ్‌గా కనిపించనుంది. ఇలా ఐటమ్స్ సాంగ్ చేసి ప్రస్తుతం ఆమె బంగ్లాను కొనడం చర్చనీయాంశం అయ్యింది.