సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (11:39 IST)

భవిష్యత్ సీఎం పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గ్రేట్.. ఊర్వశి రౌతేలా

Urvashi Rautela
ఊర్వశి రౌతేలా తెలుగు సినిమాల్లో చాలా త్వరగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే మూడు ఐటెం సాంగ్స్ చేసింది. ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చేసిన ట్వీట్ పట్ల పవన్ అభిమానులు హర్షం చేస్తున్నారు. 
 
మరికొందరు మాత్రం ఆమె అజ్ఞానాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా బ్రో సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటలో ఊర్వశితో పాటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి స్టెప్పులేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక ట్వీట్‌లో, ఆమె టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ పేరును ప్రస్తావించింది.
 
“మా చిత్రం #BroTheAvatar రేపు #28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.. .భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. అందర్నీ కలుద్దాం’’ అని ఊర్వశి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.