శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 26 మే 2022 (17:25 IST)

వరుణ్ తేజ్‌న‌ట‌న చూసి పిచ్చోడిలా చేస్తున్నావ్‌! అని అన్న‌ది ఎవ‌రో తెలుసా!

Varun Tej
Varun Tej
'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 వస్తున్న నేపధ్యంలో హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. వరుణ్ తేజ్ పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలివి.
 
ఎఫ్ 3 లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది ?
ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్  డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ చేశాం. అది హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది.
 
 నత్తి కోసం స్పెషల్ గా హోం వర్క్ చేశారా ?
అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన వుండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఈజీ అయ్యింది. ఐతే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. ఐతే అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
 
వెంకటేష్ గారి  నుండి ఏం నేర్చుకున్నారు ?
వెంకటేష్ గారితో కళ్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలౌతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్శనల్ గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్ లా వుంటారు. చిరంజీవి గారితో ఆయనకి వుండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా  విషయాలు మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి..  మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేష్ గారు చాలా లైట్ హార్టడ్. చాలా కూల్ గా వుంటారు. చాలా క్రమశిక్షణగా వుంటారు. ఆయన్ని చూసి సెట్స్ కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. పాజిటివ్ గా వుంటారు.
 
ఎఫ్2 కథ కి కొనసాగింపుగా ఎఫ్ 3 వుంటుందా ?
లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ఎఫ్ 3లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్తకథని చెప్పాం.
 
ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ?
ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ కూడ అయ్యారు. ''ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్'' అని సర్ ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా  రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు.
 
టికెట్ రేట్లు తగ్గించడం వలన అడ్వాంటేజ్ వుంటుందని భావిస్తున్నారా ?
ఎఫ్ 3 ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తన్ని సినిమా తీసుకువెళ్ళాలంటే పెరిగిన ధరలు భారం కావచ్చు. అందుకే అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలసి ఎఫ్ 3ని థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.
 
 ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసస్ కూడా మారింది. ఇది చాలెజింగ్ గా అనిపిస్తుందా ?
ఇప్పుడు కథల ఎంపిక మారింది.  ఐతే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీ లో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.
 
ఎఫ్ 3 లో కిడ్స్ గురించి స్పెషల్ ట్రాక్ వుందని విన్నాం ?
అవును. ఎఫ్ 3ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్ కి ఎలాంటి సమస్య వుందనే అంశంపై స్పెషల్ గా ఒక ట్రాక్ డిజైన్ చేశారు. ఇది అద్భుతంగా వుండబోతుంది.
 
ప్రవీణ్ సత్తారు గారితో సినిమా ఎప్పుడు సినిమా ?
ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలౌతుంది. పూర్తి యాక్షన్ సినిమా. లండన్ లో 70రోజులు షూటింగ్ వుంటుంది. నాన్నగారు, బీవిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు.