శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (17:17 IST)

హైదరాబాదులో వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని వివాహం

Hayavahini
Hayavahini
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి రెండవ కుమార్తె హయవాహిని వివాహం శుక్రవారం జరుగనుంది. అక్టోబర్ 2023లో హయవాహిని నిశ్చితార్థం విజయవాడకు చెందిన వైద్యుడితో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ మహేష్ లాంటి ప్రముఖులు ఈ  హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన అప్‌డేట్‌ ఉంది.
 
హైద‌రాబాద్‌లోనే హ‌య‌వాహిని మార్చి 15న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. పెళ్లికూతురు ఫంక్షన్, సంగీత్ లాంటి సంబరాలన్నీ జరుగుతున్నాయి. వెంకీ- దగ్గుబాటి కుటుంబం రామానాయుడు స్టూడియోస్‌లోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గట్టి భద్రత మధ్య ఈ వివాహాన్ని జరుపనున్నారు. 
 
వెంకటేష్ - అతని భార్య నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, పెద్ద కుమార్తె అశ్రితకు స్పెయిన్, ఇతర యూరోపియన్ దేశాలలో వ్యాపారం చేసే వినాయక్ రెడ్డితో ఇప్పటికే వివాహం జరిగింది. ప్రస్తుతం రెండో కుమార్తెకు వివాహం జరుగనుంది.