మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 జనవరి 2025 (14:57 IST)

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

Vijay Ranga Raju
Vijay Ranga Raju
నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గుండెపోటు‌తో మరణించిన విజయ రంగ రాజు వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. విజయ రంగ రాజు 
ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. విజయ రంగ రాజుకు ఇద్దరు కూతుళ్లు. విజయ రంగ రాజు ఎక్కువగా విలన్, సహాయ పాత్రలు పోషించారు.
 
1994లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. యజ్ఞం చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 
 
వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో కూడా ప్రవేశం ఉంది. విజయ్ రంగ రాజు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్టంట్ పెర్ఫార్మర్‌గా 5,000కి పైగా చిత్రాలలో నటించారు. బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ భైరవద్వీపం చిత్రంలో తన పాత్రతో అతనికి చెప్పుకోదగ్గ అవకాశం లభించింది. 
 
తెలుగు చిత్రాలతో పాటు, అతను తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలలో పనిచేశారు. పూణేలో పుట్టి ముంబైలో పెరిగిన విజయ్ రంగ రాజు, గుంటూరులో ఉన్నత విద్యను పూర్తి చేయడానికి ముందు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌తో పాఠశాల విద్యను పంచుకున్నాడు.