మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు, సీనియర్ నటుడు, దర్శకుడు చారుహాసన్ (93) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, నటి సుహాసిని మణిరత్నం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
"దీపావళికి ముందు మా తండ్రి అస్వస్థతకు గురయ్యారు. మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు" అని సుహాసిని చెప్పారు. శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం.
అలనాటి నటుడు, దర్శకుడైన చారుహాసన్ తమిళంతో పాటు పలు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. కన్నడ హిట్ మూవీ తబరన కథ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.