సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (08:29 IST)

ప్రకాశం జిల్లాలో దారుణం.. సోదరిపై అన్న లైంగికదాడి..

victim girl
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. సొంత సోదరిపై అన్న లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుట్టు చప్పుడు కాకుండా గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) చేయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
తాళ్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానికంగా ఉండే జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తోటి విద్యార్థులతో రోజూ చాటింగ్ చేస్తూ ఉండేది. ఆ చనువుతో విద్యార్థుల్లో ఒకరికి దగ్గరై, ఆ కుర్రోడిపై మనసు పారేసుకుంది. అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సోదరుడు ఈ విషయాన్ని గమనించాడు. పైగా, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ తంతు అనేక రోజుల పాటు కొనసాగింది. 
 
ఈ క్రమంలో ఇటీవల బాలికకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఆ బాలిక గర్భవతి అని వెల్లడైంది. దీంతో తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వివరించగా, అబార్షన్ చేయించారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎస్.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.