గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:48 IST)

మలయాళ నటుడు ముఖేష్ అరెస్ట్.. ఆపై బెయిల్‌పై రిలీజ్

Mukesh
Mukesh
కేరళ, త్రిసూర్‌లో 2010లో జరిగిన లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి సిపిఎం ఎమ్మెల్యే, నటుడు ఎం. ముఖేష్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. 
 
ఎమ్మెల్యేను సోమవారం అరెస్టు చేసి, వైద్య పరీక్షలు, పొటెన్సీ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 24న సెషన్స్ కోర్టు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారని ఆయన తరపు న్యాయవాది ధృవీకరించారు. 
 
ముఖేష్‌పై రెండు కేసులు నమోదైనాయి. ఇందులో ఒకటి వడక్కంచెరి పోలీసులు నమోదు చేయగా, మరొకటి మారాడు పోలీసులు నమోదు చేశారు. ఈ రెండింటిలోనూ ముందస్తు బెయిల్ పొందారు.