మరో వివాదంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (video)
Koneti Adimulam
ఎమ్మెల్యే ఆదిమూలంపై మహిళ ఆరోపణలు చేసిన వెంటనే తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఆ తర్వాత ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో ఆయన ఈ కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసు వ్యవహారం సద్దుమణగక ముందే మరో వివాదంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిక్కారని తెలుస్తోంది.
ఒక మహిళతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణ లీక్ అయ్యింది. ఫోన్ సంభాషణలో "నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీ పర్సనాలిటీ చాలా బావుందని" ఎమ్మెల్యే అన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మరో వివాదంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2024
ఒక మహిళతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణ లీక్
నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీ పర్సనాలిటీ చాలా బావుందన్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడంటూ ఇటీవల వీడియోలు రిలీజ్ చేసిన ఒక మహిళ
ఆ వివాదం ముగియకముందే మరో ఆడియోతో వెలుగులోకి… pic.twitter.com/WXHqlqSBOb

