శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 13 అక్టోబరు 2024 (22:27 IST)

రోడ్డుపై మండుతున్న కారు, చూద్దామని ఆగినవారిపైకి దూసుకొచ్చింది (video)

Burning Car
జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారి వంతెనపై ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. కారు అలా అగ్నికీలల్లో మండుతుండగా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దానిని చూస్తూ అలా నిలబడిపోయారు. ఇంతలో మండుతున్న కారు కాస్తా కదలడం ప్రారంభించింది. దీనితో అది వస్తున్న దారిలో పార్కింగ్ చేసి వుంచిన బైకులను తీసుకుని వాహనదారులు పరుగులు పెట్టించారు. మరికొందరు పాదచారులు బతుకు జీవుడా అంటూ పరుగు లంఘించుకున్నారు. అలా మండుతూ వున్న కారు రోడ్డుపై సుమారు 100 మీటర్ల వరకూ దూసుకు రావడంతో రోడ్డుపై వున్నవారు భయాందోళనకు గురయ్యారు.