బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (12:44 IST)

నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావా.. మామగా చేసావా? ఛైర్మన్‌గా చేశావా? (video)

MLA Bhuma Akhila Priya
MLA Bhuma Akhila Priya
నంద్యాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం విజయ డైరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. అఖిల ప్రియ విజయడైరికి వచ్చిన విషయం తెలిసుకున్న ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి.. ఆమెపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
వెంటనే ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి.. అఖిలప్రియకు ఫోన్ చేశారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి.. అఖిల ప్రియ మద్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తన సీట్లో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను జగన్ ప్రశ్నించారు. దీంతో ఆమె పైర్ అయ్యారు. ఫోన్‌లో జగన్మోహన్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.  
 
ఈ సందర్భంగా బెదిరిస్తున్నావా.. నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం.. అంటూ అఖిల ప్రియ మామకు సవాల్ చేశారు. మామగా ఫోన్ చేశావా.. విజయ డైరీ ఛైర్మన్‌గా ఫోన్ చేశావా.. అంటూ అఖిలప్రియ మామ జగన్‌ను ప్రశ్నించారు.
 
మామగా ఫోన్ చేస్తే సరే కానీ.. చైర్మన్‌గా ఫోన్ చేస్తే.. కంప్లైంట్ ఇచ్చుకోవచ్చని సూచించారు. తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డైరీలో అవినీతి అక్రమాలు చాలా జరుగుతున్నాయని.. అన్ని బయటకు తీస్తామని పేర్కొన్నారు.