సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 12 డిశెంబరు 2019 (21:38 IST)

యూనిక్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ ప్లాన్‌తో `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడుగా న‌టిస్తోన్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ  తుది ద‌శ‌కు చేరుకుంది. ఓ షెడ్యూల్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. 
 
ఇప్ప‌టికే విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా.. నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి 4 ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది.
 
విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌లుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 12న ఐశ్వ‌ర్యా రాజేష్‌, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌ను చేయ‌బోతున్నారు. 
 
ఈ నాలుగు ప్ర‌క‌ట‌న‌ల‌ను పైన పేర్కొన్న తేదీల్లో సాయంత్రం 6:03 నిమిషాల‌కే చేస్తారు.
సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై  కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతం, జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.