గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (13:02 IST)

అర్జున్ రెడ్డితో జాన్వీ కపూర్ సినిమా.. టాలీవుడ్ అరంగేట్రం ఖాయమైనట్టేనా?

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం ఖరారైనట్లు తెలుస్తోంది. తొలి చిత్రం దఢక్‌లో మంచి నటనతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. తాజాగా తెలుగులో అర్జున్ రెడ్డి హీరోతో జతకట్టనుంది. ఈ బ్యూటీని టాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను పూరీ జగన్నాథ్ తీసుకున్నారని టాక్. 
 
ఇటీవలే ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న పూరీ, తన నెక్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో, ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే జాన్వీ.. హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు టాక్ వస్తోంది. దీనికి తోడు జాన్వీ కపూర్ కూడా గతంలో సౌత్ హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరత్‌'‌‌కు రీమేక్‌గా ఓ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించారు. ప్రస్తుతం జాన్వీ.. కార్గిల్‌ గాళ్‌, రూహ్ అఫ్జా, తక్త్‌ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.