శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 17 జులై 2025 (07:34 IST)

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

Vijay Deverakonda, Satyadev
Vijay Deverakonda, Satyadev
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కింగ్‌డమ్'. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం 'అన్న అంటేనే' విడుదలైంది.
 
'కింగ్‌డమ్' నుంచి 'అన్న అంటేనే' గీతాన్ని గత రాత్రి విడుదల చేశారు నిర్మాతలు. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రుతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. 'కింగ్‌డమ్' కోసం ఈ భావోద్వేగ గీతాన్ని స్వరపరిచారు. ఈ అద్భుతమైన గీతం హృదయాలను హత్తుకునేలా ఉంది.
 
సోదరభావానికి ఒక వేడుకలా 'అన్న అంటేనే' గీతముంది. వినోదాన్ని అందించే పాటలు ఎన్నో ఉంటాయి. కానీ, బంధాలను గుర్తుచేసే పాటలు, మనసుని తాకే పాటలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన గీతమే 'అన్న అంటేనే'.
 
సోదరులుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కొత్తగా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో అన్నదమ్ముల్లాగా తెరపై కనిపిస్తున్నారు. ఇద్దరూ తమదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటలోని భావోద్వేగ లోతుని చక్కగా పండించారు. ఈ గీతం తోబుట్టువుల ప్రేమకు పరిపూర్ణమైన నివాళిలా ఉంది.
 
'అన్న అంటేనే' గీతాన్ని అనిరుధ్ స్వరపరచడంతో పాటు ఆలపించడం విశేషం. తనదైన సంగీతంతో, గాత్రంతో అనిరుధ్ మరోసారి కట్టిపడేశారు. వరుస బ్లాక్‌బస్టర్‌ గీతాలను అందిస్తూ, పాట పాటకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న అనిరుధ్.. ఇప్పుడు ఈ భావోద్వేగ గీతంతో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అందరినీ కదిలించేలా ఉంది.
 
ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలను పెంచుతూనే ఉంది. తాజాగా విడుదలైన 'అన్న అంటేనే' గీతం దర్శకుడి బలమైన భావోద్వేగ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
 
'కింగ్‌డమ్' చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'కింగ్‌డమ్' చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.