గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (12:24 IST)

లక్ష్మీ మీనన్‌తో పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు.. విశాల్

Lakshmi Menon_Vishal
నటుడు విశాల్ తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై స్పందించాడు. నటుడు విశాల్, నటి లక్ష్మీ మీనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను విశాల్ ఖండించాడు. 
 
ఇలాంటి రూమర్స్‌పై సాధారణంగా స్పందించను. కానీ నటి లక్ష్మీ మీనన్‌ని నేను పెళ్లి చేసుకున్నట్లు ప్రస్తుతం వస్తున్న రూమర్‌ని పూర్తిగా ఖండిస్తున్నాను. 
 
నటితో పెళ్లంటూ తనకు లింక్ చేస్తూ.. వార్తలు రాయడం సరికాదన్నాడు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాను. సమయం వచ్చినప్పుడు తన పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తానని తెలిపాడు.