శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 మే 2022 (11:31 IST)

విశ్వ‌క్‌సేన్ నిజ‌మైన పాగ‌ల్ - ఇండ‌స్ట్రీలో విమ‌ర్శ‌లు

Viswak sen publicity
Viswak sen publicity
హీరో విశ్వ‌క్ సేన్ చేసిన ప‌నికి సినిమారంగంలో అంద‌రూ ముక్కున‌వేలేసుకుంటున్నారు. అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసు కేసు పెట్టాల‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే! హీరో విశ్వ‌క్ సేన్ మొద‌టి నుంచి డిఫ‌రెంట్ కేండెట్‌. సినిమా ప్ర‌మోష‌న్‌కు మీడియాను పిలిచి గంట‌లపాటు ఆల‌స్యంగా వ‌స్తుంటాడు. ఇక ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటాడు. పెయిడ్ అభిమానులను మెయింటైన్ చేస్తుంటాడు.
 
సోమ‌వారంనాడు ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగింది. జూబ్లీహిల్స్ రోడ్ల‌లో ఓ వ్య‌క్తి న‌ల్ల‌టి కారు వ‌స్తుండ‌గా దానికి అడ్డంగా ప‌నుకున్నాడు. ఆ త‌ర్వాత అర్జున కుమార్ ఏడి? ఎక్క‌డా? అంటూ హ‌ల్ చ‌ల్ చేశాడు. వెంట‌నే కారు దిగి వ‌చ్చిన హీరో విశ్వ‌క్ సేన్‌.. ఏమిటి? ఇది? అంటూ ప్ర‌శ్నిస్తాడు. నువ్వు కాదు. నాకు అర్జున కుమార్ కావాలంటూ.. అటు ఇటూ తిరుగుతూ, గ‌ట్టిగా అరుస్తూ గొడ‌వ చేశాడు. విశ్వ‌క్‌సేన్‌తోపాటు వ‌చ్చిన అనుచ‌రులు కూడా కారులోంచి దిగి.. ఈయ‌నే నువ్వు కోరుకున్న వ్య‌క్తి అంటూ చెబుతారు. కానీ ఆ వ్య‌క్తి విన‌డు. ఈయ‌న హీరో విశ్వ‌క్ సేన్‌.. నాకు కావాల్సింది అర్జున‌కుమార్‌.. అంటూ డ‌బ్బా కిరోసిన్ మీద పోసుకుంటాడు. అంటించ‌మ\ని అరుస్తుంటాడు.   నేను ఆయ‌న‌కోస‌మే 34 ఏళ్ళుగా పెండ్లి చేసుకోలేదుంటూ ఏవోవే మాట్లాడుతంటాడు. చివ‌రికు ఆ వ్యక్తిని కారులో ఎక్కించుకుని అర్జున కుమార్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ‌తామ‌ని చెప్పి.. తీసుకెళ‌తారు.
 
ఇలాంటి.. ఇటీవ‌లే ఫేక్ వీడియోలు ఎక్కువ‌య్యాయి. ఆ త‌ర‌హాలో  విశ్వ‌క్ సేన్ చేసిన తంతు. అన తాజా సినిమా `అర్జున‌వ‌నంలో..` అనే సినిమా ప‌బ్లిసిటీ కోసం చేశాడు. దీంతో అక్క‌డివారితోపాటు సోష‌ల్‌మీడియాలోని వారితోపాటు ఇండ‌స్ట్రీలోని అంద‌రూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిజంగా విశ్వ‌క్‌సేన్ పాగ‌ల్ అంటూ కితాబిచ్చేశారు.