గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (16:50 IST)

షమీమ్ షాపుకు రండి... నా పేరు చెప్పి డిస్కౌంట్ పొందండి

బాలీవుడ్ నటుడు సోనూసూద్, షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లారు. కరోనా సమయంలో వలస కార్మికుల పాలిటే కాదు కష్టంలో ఉన్నపాలిట దేవుడగా మారిన సోనూసూద్ కాశ్మీర్ మార్కెట్లో తిరుగుతూ సందడి చేశారు. 
 
ఈ క్రమంలో ఓ చెప్పులు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లిన సోనూ బేరం ఆడి మరీ చెప్పులు కొన్నారు. అదేంటీ పేదవాళ్లకు సహాయం అడకపోయినా కష్టాన్ని తెలుసుకుని మరీ ఆపన్నహస్తం అందించే సోనూసూదు వీధి వ్యాపారి వద్ద బేరాలు ఆడటం ఏంటీ అనుకోవచ్చు. అదే మరి సోనూ స్టైల్.
 
షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి వద్దకు వెళ్లి చెప్పులు కొనటానికి అతని దుకాణంలోంచి ఓ జత చెప్పులు తీసుకుని 'వీటి ధర ఎంత? అని అడిగారు. అతను ధర చెప్పాడు. 
 
దానికి సోనూ..'ఏంటీ వీటికి డిస్కౌంట్ ఇవ్వవా? అని అడిగారు. దానికి అతను 20 శాతం డిస్కౌంట్ ఇస్తాను సార్ అని చెప్పాడు. సోనూ చెప్పులు కొన్నటం పూర్తి అయ్యింది. ఆ తర్వాత 'చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్‌ షాపుకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్‌ కూడా పొందండి' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేశారు సోనూసూద్‌. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.