దర్శకుడు పెద్ద వంశీగారు నటించడం గౌరవంగా భావిస్తున్నాం
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను దర్శకుడు వి.సముద్ర, ఆర్.పి.పట్నాక్ విడుదల చేశారు.
అనంతరం నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ``పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కో ప్రొడ్యూసర్స్ రవిగారు, రఘుగారి సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్ మూవీ అనే ఫీల్ వస్తుంది. కానీ నిజానికి ఇది ఫ్రెండ్‌షిప్ మూవీ బేస్ అయిన చిత్రం. బండి సరోజ్ గారు సినిమాను అద్భుతంగా చేశారు. దాదాపు 11 క్రాఫ్ట్స్‌ను ఆయన చక్కగా హ్యాండిల్ చేశారు. ఆగస్ట్ నెలాఖరులో సినిమాను విడుదల ప్లాన్ చేస్తున్నాం. మా కథ విని యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న పాపులర్ విలన్ డానియల్ బాలాజీగారికి స్పెషల్ థాంక్స్. పెద్ద వంశీగారు, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడం మాకు దొరికిన గౌరవంగా భావిస్తున్నాం. ప్రవీణ్ రెడ్డి, హిమాన్షి, కావ్యా సురేశ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ రెడ్డి చాలా టాలెంటెడ్ యాక్టర్`` అన్నారు.
బండి సరోజ్ మాట్లాడుతూ ``రెండేళ్ల ముందే ఈ సినిమాను సిద్ధం చేశాం. కానీ కోవిడ్ కారణాలతో సినిమాను రిలీజ్ చేయలేకపోయాం. సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకున్నాం. ట్రైలర్‌ను విడుదల చేసిన సముద్రగారికి, ఆర్.పి గారికి థాంక్స్. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ``సినిమాను పూర్తి చేసిన తర్వాత రిలీజ్ చేయడానికి కరోనా కారణంగా లేట్ అయ్యింది. టైటిల్ రోల్ నేనే చేశాను. ఆర్టిస్టులందరూ చక్కగా నటించారు. నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు మా `సూర్యాస్తమయం` సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను``అన్నారు.
వి.సముద్ర మాట్లాడుతూ ``ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన రఘుగారికి, విడుదల చేస్తున్న క్రాంతిగారు, అచ్చిబాబుగారికి ధన్యవాదాలు. ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. సినిమా చాలా మంచి కంటెంట్ ఉంది. బిచ్చగాడు, అర్జున్ రెడ్డిలా సక్సెస్ అవుతుందనిపించింది. బండి సరోజ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. పెద్ద వంశీగారు నటించడం విశేషం అన్నారు.