శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (19:32 IST)

ఏపీలో 20 లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు - తెలంగాణాలో ఎన్ని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 20 లక్షలు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో మరో 1435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 20,00,038కు చేరుకున్నాయి. ఇందులో మొత్తం 19,70,864 మంది కోలుకున్నారు. ఇంకా 15,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇకపోతే, గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారినపడిన వారిలో 1,695 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆరుగురు మరణించారు. మొత్తం మరణాలు 13,702కు చేరాయి. శుక్రవారం 69,173 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అలాగే, తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గింది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 359 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 494 మంది కోలుకున్నారు. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,54,394కు పెరిగాయి. వీరిలో ఇవాళ్టివరకు 6,43,812 మంది కోలుకున్నారు. మరో 6,728 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం మరణాలు 3,854కు పెరిగాయి. ఇవాళ 73,899 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.