సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (17:47 IST)

మేము మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నాం : డైరెక్టర్ హరీష్ శంకర్

Director Harish Shankar
Director Harish Shankar
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్ట్ 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ వుండబోతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ హరీష్ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
'మిస్టర్ బచ్చన్' కి ది ఓన్లీ హోప్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు కదా.. ఇందులో హీరో ఇచ్చే హోప్ లో స్పెషాలిటీ ఏమిటి?
-ఇందులో హోప్ హీరో క్యారెక్టరైజేషన్. ఈ సినిమా చేయడానికి రీజనే హానెస్టీ వున్న హీరోయిజం. ఇదొక ట్రూ ఇన్సిడెంట్. 80s ప్రాంతంలో నార్త్ ఇండియాలో జరిగింది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసిన కథ. ఆ రోజుల్లో లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా సరే ఓ ఆఫీసర్ ఎక్కడా లొంగలేదు. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది.
 
ఇందులో ఎంటర్ టైన్మెంట్ ని ఎలా బిల్డ్ చేశారు ?
-'రైడ్' కి దీనికి అజయ్ దేవగన్ కి రవితేజ కి ఉన్నంత డిఫరెన్స్ వుంటుంది. రవితేజ గారికి తగ్గట్టు సినిమా వుంటుంది. హానెస్ట్ వున్న వ్యక్తుల జీవితంలో ఫన్ రోమాన్స్ లవ్ అన్నీ వుంటాయి. ఇందులో తన ప్రేమలో నిజాయితీ వుంటుంది. తను చేసిన ఫైట్ లో నిజాయితీ వుంటుంది. నిజాయితీ అనే పాయింట్ నుంచే అన్నీ వచ్చాయి.  
 
కమర్షియల్ సినిమా టెంప్లెట్ ఇలా వుండాలని మిమ్మల్ని ఇన్ఫ్లూయిన్స్ చేసింది ఎవరు ?
-మా నాన్నగారు. ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే నాకు సినిమా ఇష్టమని ఆయనకి అర్ధమైపోయింది. చిన్నప్పటి నుంచే తెలుగు, హిందీ లిటరేచర్, సినిమాలు అంటే ఇష్టం. జంధ్యాల, బాపు రమణ సినిమాల్లో మాటలు విపరీతంగా వినేవాడిని. అలాగే ఈవీవీ సినిమాలకి కూడా ఎట్రాక్ట్ అయ్యాను.
 
మీ సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అవుతాయి. మిస్టర్ బచ్చన్ పాటలన్నీ చాలా బావున్నాయి. మిక్కీతో వర్క్ చేయడం గురించి ?
-మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ అంత వన్ వీక్ లో చేశాం. వన్ వీక్ లో నాలుగు చార్ట్ బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ గా కొన్ని సార్లు ఫెయిల్ అయినా నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆదిత్య మ్యూజిక్ వారు హరీష్ శంకర్ హిట్స్ అని క్యాసెట్ రిలీజ్ చేశారు. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. గద్దల కొండ గణేష్ లో అన్ని పాటలు హిట్టు. మిక్కీ మోస్ట్ అండర్ రేటెడ్ కంపోజర్ అని నా ఫీలింగ్. మిక్కీ చాలా మితభాషి. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది.
 
లిరిక్స్ విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటారు కదా ?
-నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం చాలా ఇష్టం. సినిమా చూడని రోజు వుంటుందేమో కానీ పాట వినని రోజు వుండదు. ఒక మంచి వాక్యం ఇచ్చిన స్ఫూర్తి మరేది ఇవ్వలేదు. నాకు మ్యూజిక్ ఒక థెరపీ. ముఖ్యంగా లిరిక్స్ ని చాలా శ్రద్ధగా వినడం, స్ఫూర్తి పొందడం అలవాటు. 'మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహల కత్తుల వంతెన'(వేటూరి) ఇలాంటి వాఖ్యలు విన్నప్పుడు గొప్ప ఎనర్జీ వస్తుంటుంది. నా పాటలు కూడా ఇలా లిరిక్స్ తో గుర్తు చేసుకోవాలనేది తాపత్రయం. ఇందులో కాసర్ల శ్యామ్, వనమాలి, భాస్కర భట్ల, సాహితీ చాలా చక్కని సాహిత్యం రాశారు.
 
-క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్ వున్న రోజులో జరిగే కథ ఇది. అప్పట్లో భాహాటంగా పోస్టర్లు పెట్టి క్యాసెట్ రికార్డ్స్  చేసేవారు. ఆ టైం ని గుర్తు చేద్దామని లిరికల్ వీడియోలో అమితాబ్ గారు, చిరంజీవి గారి పోస్టర్స్ చూపించడం జరిగింది.
 
-నేను బిహెచ్ఈల్ లో పెరిగాను. అక్కడ ఓ మంచి లవ్ స్టొరీ తీయాలని ఎప్పటినుంచో కోరిక. అయితే నాకున్న మాస్ ఇమేజ్ కి తీయడం కుదరలేదు. ఈ సినిమాలో ఆ ప్రేమ కథ కోరిక ఎంతోకొంత తీరింది. ఇందులో లవ్ స్టొరీ బ్యూటీఫుల్ గా వుంటుంది.  
 
ఇందులో రవితేజ గారిని ఎలా చూపిస్తున్నారు ?
- ఎవరూ చూడని బ్యాగ్ డ్రాప్ లో మనం మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాల్ని చూపిస్తూ, రవితేజ గారి నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దాం.
 
-సెకండ్ హాఫ్ లో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలౌతారు. నటుడిగా ఆయనలో ఒక కంప్లీట్ నెస్ కనిపించింది. ఐటీ ఆఫీసర్ కి సూట్ అయ్యేలా రవితేజ గారు తనని మలచుకున్నారు, రవితేజ గారికి సూట్ అయ్యేలా కథని మలుచుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేశాం.
 
ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు కదా.. ప్రొడ్యూసర్ సపోర్ట్ గురించి ?
-విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు, 15న రిలీజ్ చేసేవాళ్ళం కాదు. మార్కెట్, ఫైనాన్సియల్ ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తునప్పుడు కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో బిజీ అయ్యారు. కాంపెయిన్ నుంచి రిజల్ట్ వచ్చేవరకూ ఈ సినిమా ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. రవితేజ గారు లాంటి హీరో, విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యింది.
 
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ?
-90s బ్యాక్ డ్రాప్ లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి వుండాలి అన్నప్పుడు.. అ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. తను చాలా హార్డ్ వర్క్ చేసింది, అద్భుతంగా పెర్ఫార్ చేసింది.
 
ఇందులో నాలుగు ఫైట్స్ వున్నాయి కదా.. మాస్ ఆడియన్స్ కి హై ఎలా వుంటుంది?
-ఈ నాలుగు ఫైట్లే పది ఫైట్ల ఇంపాక్ట్ ఇస్తాయి. రవితేజ గారి సినిమా అంటే మాస్ తో పాటు ఫ్యామిలీస్ కూడా చూస్తారు. ఈ సినిమా హోల్సమ్ ఎంటర్ టైనర్.
 
డీవోపీ అయనంక బోస్ తో పని చేయడం గురించి ?
-ఇది మేము కలసి చేసిన నాలుగో సినిమా. మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నాం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నా విజన్ ని మార్చారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా వుంటుంది.
 
ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి గురించి ?
-కేజీఎఫ్ చూసిన తర్వాత నన్ను ఫస్ట్ ఎట్రాక్ట్ చేసింది ఎడిటింగ్. చాలా నచ్చింది. అప్పుడే ఎడిటర్ గురించి అడిగాను. ఒక రోజు నా ఆఫీస్ కి వచ్చాడు. తనని చూసి షాక్ అయ్యా. ఇరవై మూడేళ్ళ కుర్రాడు. తనతో ఇంటరాక్షన్ బాగా నచ్చింది. మొదట ఉస్తాద్ భగత్ సింగ్ కి పెట్టాను.
 
మిస్టర్ బచ్చన్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు ?
-మిస్టర్ బచ్చన్ మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది. ఖచ్చితంగా సినిమా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా వుంటుంది.