శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (10:44 IST)

క్రికెటర్లతో డేటింగ్ చేయమని సలహా ఇచ్చారు : రిచా చద్దా

మంచి పబ్లిసిటీ కావాలంటే క్రికెటర్లు, సూపర్ స్టార్లతో డేటింగ్ చేయమని సలహా ఇచ్చారని ప్రముఖ నటి రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సలహాను తాను తోసిపుచ్చినట్టు తెలిపారు.

మంచి పబ్లిసిటీ కావాలంటే క్రికెటర్లు, సూపర్ స్టార్లతో డేటింగ్ చేయమని సలహా ఇచ్చారని ప్రముఖ నటి రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సలహాను తాను తోసిపుచ్చినట్టు తెలిపారు.
 
ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘గంగాస్ ఆఫ్ వాసేయ్‌పూర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆమె నటించిన ‘జియా ఔర్ జియా’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుపెట్టాక పర్సనల్ అసిస్టెంట్ ఒకరు ఫలానా నటుడికి టెక్ట్స్ మెసేజ్ పంపించాలని చెప్పాడు. అతడితో డేటింగ్ చేయమని కోరాడు. అతడికి పెళ్లయింది కదా? అని ప్రశ్నిస్తే అప్పుడతడు ఓ క్రికెటర్ పేరు చెప్పి అతడికి  మెసేజ్ ఎందుకు పంపించకూడదు? అని ఎదురు ప్రశ్నించాడు. మీ పబ్లిక్ ఇమేజ్‌కు, పబ్లిక్ రిలేషన్స్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది' అని అతడు తనకు సలహా ఇచ్చాడని వివరించింది.
 
ఇప్పటివరకు తాను డేటింగ్ జోలికి వెళ్లలేదన్నారు. బయట నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన వారికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పింది. తనకు ఇటువంటివి ఇష్టం లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని వివరించింది. ఇండస్ట్రీలో అందరితో సంబంధాలు ఉండాలని, కానీ అవి ఈ తరహా మాత్రం కాకూడదని పేర్కొంది.