ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:03 IST)

ఆచార్యకు వాయిస్ ఇవ్వనున్న మహేష్ బాబు...

Mahesh Babu
ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ పాలుపంచుకోనున్నాడట. ఎలాగంటే వాయిస్ ఓవర్ ద్వారా. అవును మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ నటిస్తున్న ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని అంటున్నారు. మహేష్ వాయిస్ తో ఈ సినిమా మొదలవుతుందట.
 
హీరోల క్యారెక్టర్స్‌ను మహేష్ వాయిస్ ద్వారా పరిచయం చేస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.   మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి తెగ ఖుష్ అవుతున్నారు. 
 
గతంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా , తారక్ నటించిన బాద్షా సినిమాలకు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ తన వాయిస్ ఓవర్ తో ఆచార్య సినిమాకు మరింత మైలేజ్ ఇవ్వనున్నారని అంటున్నారు.