రజినీకాంత్ 166 ప్రాజెక్టులో నయనతార లక్కీ ఛాన్స్

Nayanatara
Last Updated: ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (12:41 IST)
హీరోయిన్ నయనతార మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే 166వ చిత్రంలో నటించనుంది. 'చంద్ర‌ముఖి' చిత్రం త‌ర్వాత న‌య‌న‌తార 'కుసేల‌న్'‌, 'శివాజీ' చిత్రాల‌లో ర‌జనీకాంత్‌తో క‌లిసి ఓ సాంగ్‌లో ఆడిపాడింది. మ‌ళ్ళీ చాన్నాళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేందుకు ఈ అమ్మ‌డు సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ 166వ ప్రాజెక్టుకు ఏఆర్.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ 166వ చిత్రంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోకాకుండా మాస్‌ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అన్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు.

అయితే ఇందులో క‌థానాయిక‌గా న‌య‌నతార అయితే బాగుంటుంద‌ని భావించిన నిర్మాత‌లు ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. కాల్షీట్స్ ఖాళీ లేక‌పోయిన కూడా స‌ర్ధుబాటు చేసుకొని సినిమాలో న‌టిస్తాన‌ని చెప్పింద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ విష‌యంపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :