శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 5 జూన్ 2020 (18:15 IST)

టెన్షన్‌లో క్రిష్‌, మరి.. పవన్ క్రిష్‌ మాట వింటాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమాతో పాటు పవన్ విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారనగా కరోనా రావడం.. షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం జరిగింది. అయితే జూన్ నెలలో కానీ జులైలో కానీ షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయాల్సివుంది. షూటింగ్స్ స్టార్ట్ చేసిన వెంటనే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయనున్నాడు. అయితే క్రిష్‌‌తో చేస్తున్న సినిమా చారిత్రాత్మక చిత్రం. పైగా పాన్ ఇండియా మూవీ. అందుచేత ఎక్కువమంది ఆర్టిస్టులతో చేయాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయట. కనుక వకీల్ సాబ్ తర్వాత క్రిష్‌‌తో సినిమా కాకుండా హరీష్‌ శంకర్‌తో చేయాలనుకున్న సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్.
 
ఈ విషయం తెలిసి క్రిష్.. టెన్షన్ పడుతున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అందుచేత ముందుగా తక్కువ ఆర్టిస్టులతో ఉన్న సన్నివేశాలను చేద్దమని.. ఆతర్వాత భారీ సెట్టింగ్‌లో ఎక్కువ ఆర్టిస్టులతో ఉన్న సీన్స్ చేద్దమాని పవన్‌కి సర్థి చెప్పే ప్రయత్ని చేస్తున్నాడట క్రిష్‌. మరి... క్రిష్‌ మాట పవన్ వింటాడో లేదో చూడాలి.