గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జులై 2018 (11:00 IST)

'మల్లీశ్వరి'తో వ్యాయామం యమ డేంజర్ : సోనాక్షీ సిన్హా

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "మల్లీశ్వరి". ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించింది. దీంతో ఈమెను తెలుగులో కత్రినా కంటే మల్లీశ్వరిగా గుర్తుండిపోయింది. ఇపుడు ఈ మల్లీశ్వరి మరో

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "మల్లీశ్వరి". ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించింది. దీంతో ఈమెను తెలుగులో కత్రినా కంటే మల్లీశ్వరిగా గుర్తుండిపోయింది. ఇపుడు ఈ మల్లీశ్వరి మరో బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హాతో కలిసి వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ నటీమణులు తమ ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు.
 
కత్రినా కైఫ్, సోనాక్షీ సిన్హాలు కలిసి జిమ్‌లో తమ తదుపరి సినిమాకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరు ట్రైనర్ సమక్షంలో వ్యాయామాలు కొనసాగిస్తున్నారు. కాగా సోనాక్షీ ఇక వ్యాయామం చేయలేనని కోచ్‌కు మొరపెట్టుకుంది. అయినా అతను ఆమెను వ్యాయామం చేయాల్సిందేనని హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. కాగా వీడియోను పోస్టు చేసిన సోనాక్షీ... 'కత్రినాతో వ్యాయామం ఆరోగ్యానికి హానికరం' అని కామెంట్ రాసింది. ఈ వీడియోనూ మీరూ ఓసారి తిలకించండి.