శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (17:04 IST)

`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`లో `నైలున‌ది` సాంగ్ చాలా బాగుంది: త‌మ‌న్నా.

WWW Nailunadi song
`118` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ మూవీ నుండి ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యం అందించ‌గా స్టార్ సింగ‌ర్ సిద్‌ శ్రీ‌రామ్, క‌ళ్యాణి నాయ‌ర్ ఆల‌పించిన మెలోడియ‌స్ సాంగ్ `నైలు న‌ది`ని స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా రిలీజ్ చేశారు.
 
ఈ సంద‌ర్భంగా తమ‌న్నా మాట్లాడుతూ, ``నైలున‌ది` సాంగ్ బాగుంది. గుహ‌న్ గారు `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`తో మ‌రో మంచి హిట్ కొట్టాలి. ఆదిత్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌ల‌కు ఆల్ ది బెస్ట్ అలాగే రామంత్ర క్రియేష‌న్స్ టీమ్‌కి నా బెస్ట్ విషెస్‌`` అన్నారు. ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ,   ``నైలున‌ది మెలోడియ‌స్ సాంగ్‌ని రిలీజ్ చేసిని త‌మ‌న్నాకి థ్యాంక్స్‌. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే ఇది డిఫ‌రెంట్ మూవీ`` అన్నారు.
 
చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల  మాట్లాడుతూ, `` త‌మ‌న్నా గారు మా నైలున‌ది సాంగ్ రిలీజ్ చేసినందుకు స్పెష‌ల్ థ్యాంక్స్‌. గుహ‌న్ గారి డైరెక్ష‌న్లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అంద‌రినీ త‌ప్ప‌కుండా థ్రిల్ చేస్తుంది`` అన్నారు. హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ, ``అడిగిన వెంట‌నే మా మీద అభిమానంతో నైలు న‌ది సాంగ్ రిలీజ్ చేసిన త‌మ‌న్నా గారికి థ్యాంక్స్‌. ఈ సాంగ్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీలో ఒక హైలెట్ అవుతుంది`` అన్నారు.
 
హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ,  ``నా ఫ‌స్ట్ మూవీ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యులో నాకు ఎంతో ఇష్ట‌మైన నైలున‌ది సాంగ్‌ని నాకు ఎంతో ఇష్ట‌మైన హీరోయిన్ త‌మ‌న్నా గారు రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది`` అన్నారు. కో - ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ దాట్ల మాట్లాడుతూ, ``టాప్ హీరోయిన్ త‌మ‌న్నా గారు మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో ఫ‌స్ట్ మూవీ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు సాంగ్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. గుమ‌న్ గారు ఈ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ చేయ‌డానికి డెడికేటెడ్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ స్పీడ్‌గా జ‌రుగుతోంది`` అన్నారు.
 
రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ,  ``డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీ నుండి నేను రాసిన మంచి ల‌వ్‌సాంగ్ నైలున‌ది..పెరిగిన దూరం మ‌రికొంచెం ప్రేమ‌ను పెంచింది..ఈ సాంగ్‌ని త‌ప్ప‌కుండా మీరు ఎంజాయ్ చేస్తారు`` అన్నారు. అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్, ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్, సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌, ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌: నిఖిల్ హ‌స‌న్‌, డైలాగ్స్‌: మిర్చి కిర‌ణ్‌, లిరిక్స్‌: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌ శ్రీ‌రామ్‌, కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్, స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పొన్మ‌ని గుహ‌న్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. రవి కుమార్‌, కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల, నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దాట్ల, క‌థ‌, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కె వి గుహ‌న్‌.