కేజీఎఫ్ కోసం ఆరేళ్లు కష్టపడిన యష్.. ఏప్రిల్ 14న సూపర్ ట్రీట్
కేజీఎఫ్ కోసం యష్ ఆరేళ్లు పనిచేశాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ తొలి భాగం భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ 2 వస్తోంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఏది ఏమైనా యశ్‌తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు ఈ రెండు భాగాల కోసం కష్టపడ్డారు. తెలుగులో "బాహుబలి" రెండు భాగాల కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో కెజిఎఫ్ కోసం యశ్ కూడా అంతే కష్టపడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతకాలం ఒకే తరహా లుక్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. తాజాగా సీక్వెల్‌కి సంబంధించి డబ్బింగ్ ను పూర్తి చేశాడట యశ్. దాంతో ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టేశాడు. ఏప్రిల్ 14న కెజిఎఫ్2ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.