యశోదగా వస్తోన్న సమంత... స్టార్ హీరోల చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ (video)
చైతూతో విడాకులు, పుష్పలో ఐటమ్ సాంగ్ తర్వాత సమంత పూర్తి స్థాయిలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. పాన్ ఇండియా లెవల్‌లో రాణించేందుకు సమంత ముఖానికి సర్జరీ కూడా చేయించుకుంది.
తాజాగా ఆమె యశోద సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది ఈ యశోద మూవీ. తాజాగా యశోద ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. యశోద సక్సెస్ కావాలంటూ ఆకాంక్షించారు.
పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో వస్తుండగా.. ఆయా భాషల ట్రైలర్స్‌ను హీరోలు రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, సూర్య, వరుణ్ ధవన్ లాంఛ్ చేశారు.ఈ ట్రైలర్‌లో సమంత నటన హైలైట్‌గా నిలిచింది.
"నీకు ఎప్పుడైనా గుండె చప్పుళ్లు వినిపించాయా" అని సమంత అడిగే సంభాషణతో ఈ ట్రైలర్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ చిత్రంలో సమంత గర్భవతిగా కనిపించనున్నారు.