1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:29 IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్క్ ధరెంతో తెలుసా?

NTR
తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతి విషయానికీ అభిమానులు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. వారి అలవాట్ల గురించి, వాళ్లు వాడే బ్రాండ్స్ గురించి ఆసక్తి చూపుతుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ విషయంలో మరికాస్త ఫాస్ట్‌గా ఉన్నారు. 
 
ఇప్పటికే ఎన్టీఆర్ పెట్టుకునే వాచ్, ధరించే షూస్ గురించిన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియాలో పెట్టేశారు. తాజాగా ఎన్టీఆర్ మాస్క్ గురించిన సమాచారాన్ని కూడా వైరల్ చేస్తున్నారు.
 
ఇటీవల స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి హాఫ్ శారీ ఫంక్షన్‌కు ఎన్టీఆర్ దంపతులు హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్‌కు వచ్చినపుడు ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ యూఎస్ స్పోర్ట్స్ బ్రాండ్‌కు చెందిన ఆ మాస్క్ ధర రూ.2340 రూపాయలట. 
 
ఎన్టీఆర్ ధరించడంతో ఆ మాస్క్ కొనేందుకు ఆయన అభిమానులు కూడా ప్రయత్నిస్తున్నారట. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ''ఆర్ఆర్ఆర్''లో నటిస్తున్నాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.