సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (14:47 IST)

వివేక్ ఒబెరాయ్‌పై కేసు.. భార్యతో బైకుపై షికారు..

vivek Oberai
భార్య బైక్ పై షికారుకు వెళితే ఎందుకు కేసు నమోదు చేశారా అని ఆశ్చర్య పోతున్నారా ... అవునండి నిజమే బాలీవుడ్ నటుడు వివేక ఒబెరాయ్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ముంబైలో హార్లే డేవిడ్సన్ బైక్‌పై విహరిస్తూ అదరగొట్టారు. 
 
షికారు చేసే సమయలో మాస్క్ గానీ, హెల్మెట్ గానీ ధరించలేదట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్'గా మారింది. అంత మాత్రానా కేసు నమోదు చేసారా అని కదా మీ డౌట్. అవునండి. 
 
వాలెంటైన్ డే రోజున వివేక్ బైక్‌పై అలా మాస్క్ గానీ, లేదా హెల్మెట్ గానీ లేకుండా వెళ్లడం చట్టవిరుద్ధం కావడంతో శాంటాక్రూజ్ ట్రాఫిక్ పోలీసులు వివేక్'కు రూ.500 ఫైన్ వేశారు. ఈ ఉల్లంఘన చేసినందుకు ఐపిసి సెక్షన్లు 188, 269 రెండింటి కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక మరోవైపు తనపై ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై వివేక్ ఒబెరాయ్ ఇంకా స్పందించలేదు. ఇదండి సంగతి ఇపుడు చెప్పండి మీరే.