శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (10:05 IST)

12వ రోజు కూడా ఇతే తంతు.. డీజిల్‌, పెట్రోలు ధరలు పెంపు

పెట్రోలు ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా వరుసగా 12వ రోజు కూడా డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.58కి చేరింది. అలాగే డీజిల్‌ ధర రూ. 80.97కు పెరిగింది. 
 
ఇక ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.92, డీజిల్‌ రూ.87.62కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.18గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.31కి చేరింది. ఏపీలోని విజయవాడ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.26 కాగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.84 గా ఉంది. కాగా.. ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతూ పోతుంటే సామన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.