శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:15 IST)

ఆల్‌టైమ్ రికార్డు : వరుసగా ఎనిమిదో రోజూ బాదుడే

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గత ఎనిమిది రోజులుగా వీటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీలు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాను చేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో చమురు ధరలు ఆల్‌టైన్ గరిష్టస్థాయికి చేరాయి. 
 
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం కూడా లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.26-30పైసలు పెంచగా లీటర్‌ డీజిల్‌పై 33-38పైసలు పెంచారు. దీంతో  దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ ధర రూ.89.29 దాటింది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.70కు పెరిగింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.84, డీజిల్‌ ధర రూ.86.93గా ఉన్నాయి. గత ఎనిమిది రోజుల నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.36, డీజిల్‌ రేటు రూ.2.91 పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రో ధరలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.89.29, ముంబైలో రూ.95.75, చెన్నైలో రూ.91.45, హైదరాబాద్‌లో 92.84, బెంగుళూరులో రూ.92.28, పాట్నాలో రూ.91.67, లక్నోలో రూ.87.27, జైపూర్‌లో రూ.95.75, గుర్గామ్‌లో 87.29 చొప్పున ఉన్నాయి.