మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:02 IST)

పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు.. ఈ నెలలో ఏడోసారి ధరల పెంపు

పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా ఐదవరోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర లీటరుకు 25 నుంచి 30 పైసలు వరకూ పెరిగింది.

అదేవిధంగా డీజిల్ లీటరుకు 35 పైసలు వరకూ పెరిగింది. దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర రూ. 98.98 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 90.82 రూపాయలుగా ఉంది. 
 
మహారాష్ట్రలోని పర్బణీలో పెట్రోల్ 97.05 రూపాయలు, డీజిల్ 86.44 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 88.44 రూపాయలుగా ఉండగా, డీజిల్ 78.74 రూపాయలుగా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర 94.93 రూపాయలు, డీజిల్ ధర 85.70 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఏడుసార్లు పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్లైంది